Srinu Vaitlaరవితేజ నుంచి ‘టచ్ చేసి చూడు’ సినిమా రాబోతోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాశిఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతోంది.ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మాస్ మహారాజ. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. సినిమాలో రవితేజ ఎన్నారై గా కనిపించబోతున్నాడట. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్, యుఎస్’లో ఎక్కువ భాగం షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here