RGV Tweets On Agnyaathavaasi Movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి ‘గా ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అజ్ఝాతవాసి’ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొన్నాడు. పవన్ అభిమానుల్లో కొందరు పెదవి విరిచడం కనిపించింది. పవన్ నటన, ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్, కామెడీ, కొడకా కోటీశ్వరరావు పాట సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఐతే, పవన్-త్రివిక్రమ్ సినిమా రేంజ్ లో లేదన్నది ప్రధాన విమర్శ.అజ్ఞాతవాసి చిత్రంపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో స్పందించాడు. పవన్‌ కెరీర్‌లోనేఅత్యంత డిజాస్టర్‌ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని పరోక్షంగా సెటైర్లు వేశాడు.
అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి  పై ట్వీట్ చేసాడు.. ‘అజ్ఞాతవాసి’కి కత్తి ఇచ్చిన రివ్యూ వీడియోను తాను ఇప్పుడే చూశానని పేర్కొన్న వర్మ.. పవన్ కంటే కత్తి మహేశ్ చాలా అందంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వర్మ తనను పొగడడంతో ఉబ్బితబ్బిబ్బయిన కత్తి ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. జబర్దస్త్ ఫేం హైపర్ ఆది మాత్రం వెరైటీగా స్పందించాడు. వీరిద్దరి తీరు చూస్తుంటే ‘ఇదిగో తెల్ల కాకి అంటే.. అదిగో పిల్ల కాకి’ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశాడు. కత్తి మహేశ్ పేరు వింటేనే రగిలిపోతున్న పవన్ అభిమానులు ఆర్జీవీ ట్వీట్‌పై మండిపడుతున్నారు. కత్తిని పొగడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో  కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ ఆర్జీవీని ఎండగడుతున్నారు.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here