Ramya Krishna Waiting For Gang Releaseసూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ అనువాద చిత్రం ‘గ్యాంగ్‌’. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. సీనియ‌ర్ క‌థానాయిక ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్న ఈ చిత్రం త‌మిళంలో ‘తాన సేరంద కూటం’ పేరిట విడుద‌ల కానుంది. హిందీలో విజ‌యం సాధించిన ‘స్పెష‌ల్ 26’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింద‌ని త‌మిళ‌నాట క‌థనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు..ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో తన వయసుకు తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ‘బాహుబలి’ లో ఆమె చేసిన ‘శివగామి’ పాత్ర .. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ‘బంగార్రాజు’ భార్యగా ఆమె చూపిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె సూర్య ‘గ్యాంగ్’ సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర చేశారు. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి పేరు తెస్తుందో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here