National Anthem In Theatresసినిమా థియేటర్స్ లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులందరు తప్పనిసరిగా లేచి నిలబడాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు సపోర్టు చేస్తే, మరికొందరు వ్యతిరేకించారు. బార్లు, ఇతర ప్రదేశాల్లోనూ జాతీయ గీతాలాపణకు ఆదేశించాలని కొందరు సైటైర్స్ వేశారు. తాజాగా, ఈ అంశంపై సుప్రీం సవరణ చేసింది. సినిమా హాళ్లలో చలన చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పుపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here