Nani Romance With Rakulక్రితం ఏడాది హ్యాట్రిక్ హిట్ అందుకున్న నాని, ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ‘భలే మంచిరోజు’ .. ‘శమంతకమణి’ సినిమాలను రూపొందించిన ఆయన, నాగ్ – నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయ్యింది. ఈ సినిమాలో నాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా కనిపించబోతున్నారు.  .ఇప్పుడు నాని కోసం హీరోయిన్ కూడా దొరికింది.నాని కోసం రకుల్ ని ఎంపిక చేశారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నానితో జతకట్టేందుకు రకుల్ ఆసక్తిని కనబర్చినట్టు సమాచారమ్.వరుస హిట్స్ తో నాని జోరు మీద ఉండటంతో, ఆయనతో కలిసి నటించడానికి స్టార్ హీరోయిన్స్ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలోనే నానితో చేయడానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఇక, నాగ్ కోసం హీరోయిన్ ఫైనల్ అవ్వాల్సింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here