సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం ‘మ‌న‌సుకు న‌చ్చింది’. మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ర‌థ‌న్ సంగీతమందించారు. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. కాగా, ఈ చిత్రం ట్రైల‌ర్‌ని మంగ‌ళ‌వారం మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ప్రామిసింగ్ ఉంద‌ని ప్ర‌శంసిస్తూనే.. త‌న సోద‌రికి, చిత్ర బృందంకి విషెస్ తెలియ‌జేశారు మ‌హేష్‌. ఓ అమ్మాయి, ఓ అబ్బాయిల మ‌ధ్య ఉండే స్నేహ‌బంధంతో పాటు ప్రేమ‌బంధాన్ని కూడా చూపుతూ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ సినిమాని తీర్చిదిద్దార‌ని అనిపిస్తోంది. కాగా, ఈ నెల 26న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here