Kalyan Ram Son In Ntr Biopicఎన్టీఆర్ మీద మూడు బయోపిక్ లు రాబోతున్నట్లు మొన్నటివరకూ ఒక స్థాయి రచ్చ జరిగిపోయింది. సోషల్ మీడియాలో బాగా హడావిడి చేసిన వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇంకా సెట్స్ మీదకే రాలేదు. సెట్స్ మీదకొచ్చిన ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చప్పుడు చప్పున ఆగిపోయింది. కట్ చేస్తే..  ఇప్పుడు నందమూరి ఇలాకా నుంచే ప్లాన్ చేసిన ఒరిజినల్ బయోపిక్ వార్తల్లోకొచ్చేసింది. ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయోపిక్ టీజర్ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. సినిమాల్లోకి ఎంట్రీ .. అగ్ర కథానాయకుడు కావడం .. రాజకీయాల్లోకి రావడం వరకూ ఈ బయోపిక్ లో చూపిస్తారట. ఈ నేపథ్యంలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్ర కోసం కల్యాణ్ రామ్ తనయుడు ‘శౌర్య’ను ఎంపిక చేసినట్టు సమాచారం. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాకి, బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను షూట్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here