Jai Simha Reviewనటీనటులు : బాలకృష్ణ, నయనతార, నటాషాదోషి , హరిప్రియ, ప్రకాష్ రాజ్
ఎడిటర్ :       ప్రవీణ్ ఆంటోనీ 
సినిమాటోగ్రాఫర్ :  సి. రామ్ ప్రసాద్ 
మ్యూజిక్ డైరెక్టర్ : గిబ్రాన్
డైరెక్టర్ : కేఎస్ రవికుమార్
ప్రొడ్యూసర్ :  సి కళ్యాణ్ 
విడుదల తేదీ : 12 జనవరి 2018

నందమూరి నటసింహం బాలయ్య నటించిన 102 చిత్రం ‘జై సింహా’ సంక్రాంతి కానుకగా ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. , నయనతార, నటాషా దోషి, హరిప్రియలు ప్రధాన తారాగణంగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై సింహా’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందొ తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథ విషయానికొస్తే,
ఈ సినిమాలో హీరో నరసింహం (బాలకృష్ణ) ఒక చంటి బిడ్డను పెంచుతూ తన జీవితం చూపిస్తాడు దర్శకుడు. బయటకు మామూలుగా కనిపించే నరసింహం లోపల ఎంతో బాధ, పగ ఉంటుంది. అనుకోకుండా అతని కొందరు టార్గెట్ చేసి, అటాక్ చేస్తూ ఉంటారు. బాలయ్య వారి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. బాలయ్యకు మొరళీమోహన్ కుటుంబం అండగా ఉంటుంది. అసలు బాలయ్య పెంచుతున్న ఆ చంటిబిడ్డ  ఎవరు? అతన్ని ఎందుకు టార్గెట్ చేసి, ఎందుకు వెంబడిస్తున్నారు? వారి నుంచి బాలయ్య ఎందుకు తప్పించుకుంటున్నాడు? చివరకు ఏమౌతుంది ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు,
నందమూరి బాలకృష్ణ.. నట సింహం మరోసారి పవర్ ఫుల్ గా గర్జించింది. సినిమా అంచనాలకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్ తో పాటుగ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను అలరించాడు బాలయ్య బాబు.ఈ సినిమాలో బాలయ్య హైలెట్ అని చెప్పుకోవచ్చు. నందమూరి ఫాన్స్ కి ఎలా కావాలో అలా ఉన్నాడు బాలయ్య. ఇక డైలాగ్స్ విషయంలో బాలయ్య ఎంతగా గర్జిస్తాడో మనదంరికీ తెలిసిందే. ఆ విషయంలో మళ్ళీ తన సత్తా చాటాడు. నయనతార ఉన్నది కొంతసేపే అయినా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించింది. సినిమాలో ఆమె ట్విస్ట్ బాగుంటుంది. ఇక హరిప్రియ కూడా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మొరళీమోహన్ తన సహజనటనతో ఎప్పటిలానే, తనదైన శైలిలో అలరించారు. మురళి మోహన్ చాలా రోజుల తర్వాత తన తరహా పాత్రలో కనిపించి అలరించాడు. విలన్ గా చేసిన అతను కూడా బాగా చేశాడు. బ్రహ్మానందం కామెడీ పర్వాలేదు.

సాంకేతిక విభాగం,
చిరంతన్ భట్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది.. రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. రత్నం కథా మాటలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. రవికుమార్ డైరక్షన్ కూడా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశారు రాం లక్ష్మన్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ , 
కథలోని ట్విస్ట్ లు, 
యాక్షన్ సన్నివేశాలు, 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , 
సినిమాటోగ్రఫి.

మైనస్ పాయింట్స్ :
బ్రహ్మానందం కామెడి  
స్లో గా సాగినా స్క్రీన్ ప్లే

ఫస్ట్ హాఫ్
బుధవారం విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి వస్తున్న డివైడ్ టాక్‌ ‘జై సింహా’ చిత్రానికి కలిసివచ్చే  అంశం అవడం వలన ఈ సినిమా కొంత బాగున్నా సినిమా సూపర్ హిట్ టాక్ వస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి..

టాగ్ లైన్ : జై సింహ – జై హిట్టు

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here