AP CM Meeting With PM Modiప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ రేపు జరగనుంది..ఈ సమావేశంలో విభజన అంశాలు ప్రస్థావనకు రానున్నాయి. అలాగే కాపు రేజర్వేషన్లను ప్రధాని దగ్గర చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా దొరకలేదు. ఈ క్రమంలో మోదీ అపాయింట్ ఇచ్చారు. దీంతో చాలా కాలం తర్వాత మోదీ చంద్రబాబుతో సమావేశం కానున్నారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అసెంబ్లీ సీట్ల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు, కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా మోదీ వద్ద బాబు ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.   కాగా… ప్రధానికి వివరించే అంశాలపై నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు ఉన్నతాధికారులు అందజేశారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here