వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. కర్నూలు- కడప జిల్లా సరిహద్దులోని ఎస్ఎస్ దాబా నుంచి ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఆన్ లైన్ లో ఎందుకు తొలగించిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆన్ లైన్ ఉన్న ఆ మేనిఫెస్టోన్ తొలగించారని విమర్శించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నట్టయితే గుండ్రేవుల, రాజోలి ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు కింద రెండు పంటలకు నీరు అందేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ నిధులు వడ్డీకే సరిపోలేదని , పేదలకు ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టివ్వలేదని జగన్ విమర్శించారు. కాగా ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు 100 కిలోమీట‌ర్లు న‌డిచారు. కాసేప‌ట్లో ఆయ‌న క‌ర్నూలు జిల్లాలోని చాగ‌లమ‌ర్రికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ విద్యార్థులు, స్థానికుల‌తో ముచ్చ‌టించి అనంత‌రం ముత్యాలపాడు బస్టాండ్ లో ప్రజా సమావేశంలో పాల్గొంటారు. ఆ త‌రువాత‌ సెట్టివేడు మీదుగా గొడగనూర్‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రోజు రాత్రికి జ‌గ‌న్మోహన్ రెడ్డి చక్రవర్తులపల్లిలో బస చేస్తారు.