అఖిల్ కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఈ రోజున సర్ ప్రైజ్ చేస్తానని నిన్ననే అఖిల్ చెప్పాడు.అన్నట్లుగానే ఈ చిత్రానికి సంబంధించిన మూవీ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈనెల 16వ తేదీన విడుదల అవుతుందని చెప్పాడు. ఫస్ట్ లుక్ కొంచెం డిఫరెంట్‌గా ఉండటంతో.. టీజర్‌పై అంచనాలు పెరిగాయి. కాగా, ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హలో’ చిత్రంలో డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయనీ, ఈ సినిమా తనకి భారీ సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. 
Hello