Spyder
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ‘స్పైడర్‌’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. హేరిస్‌ జయరాజ్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు సూపర్‌హిట్‌ అయి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, సెప్టెంబర్‌ 15 సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే అభిమానుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరుగుతుంది. ఈ ఫంక్షన్‌లో ‘స్పైడర్‌’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కి సంబంధించిన బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. తమిళ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు సొంతం చేసుకున్నారనేది తాజా సమాచారం. ఇందుకోసం వాళ్లు ఎంత చెల్లించారనేది తెలియదుగానీ, భారీ మొత్తానికే ఈ రైట్స్ అమ్ముడైనట్టు చెబుతున్నారు.. సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here