PM Modi
మయన్మార్ పర్యటన లో కీలక ఒప్పందాల తర్వాత వివేకానంద స్వామి చికాగో లో ప్రసంగించి 125 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మోడీ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.. ఇక ప్రస్తుతం షింజో అబె పర్యటన కి సిద్ధమవుతున్నారు. జపాన్‌ ప్రధాని షింజో అబె రేపు రాష్ట్ర పర్యటనకు రానున్న సందర్భంగా 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు మోడీ, అబెలిద్దరూ ఇండో జపనీస్‌ వార్షిక సదస్సుతో సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
 
గురువారంనాడు నేతలిద్దరూ గాంధీనగర్‌ను సందర్శించనున్నారు. గాంధీనగర్‌లో 2 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ, అబె విమానాశ్రయంనుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరం రోడ్‌ షో నిర్వహిస్తారు. ఈ రోడ్‌ షో శబర్మతి ఆశ్రమం వద్ద ముగుస్తుంది. అనంతరం సాయంత్రం సమయంలో వారు 16వ శతాబ్దంనాటి మసీదును సందర్శిస్తారు. రాత్రి ఒక హెరిటేజ్‌ రెస్టారెంట్‌లో విందులో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here