Laxmiప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌లు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మూడు సినిమాలు ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.  ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరోటి రెడీ అవుతోంది. దీనికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు ఖరారు చేశారు. ఇక దీనికి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ వస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. నిజమెంతో తెలీదుకానీ, లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనేది తాజా వార్త. ఆమె ఎవరోకాదు.. ‘జూలీ-2’లో నటించి రాయ్‌లక్ష్మీ. ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి ఆమె దాదాపుగా ఓకే చెప్పిందని ఇన్‌సైడ్ సమాచారం. ఇదిలావుండగా కృష్ణాజిల్లా నిమ్మకూరులో ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ మూవీ చిత్రీకరణపై గ్రామపెద్దలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ లైఫ్‌లో కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్‌ అక్కడికి వెళ్లింది. పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలను కలిసి షూటింగ్ చేస్తామని కేతిరెడ్డి టీమ్ విజ్ఞప్తి చేశారు. దీనికివాళ్లు నిరాకరించారు. ఇందులో ఏవైనా అభ్యంతకరమైన సన్నివేశాలుంటే ఎన్టీఆర్‌కి, ఆయన సొంతూరు నిమ్మకూరుకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో అభ్యంతరం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here