Rajamouli
రాజమౌళి ‘మహాభారతాన్ని’ తెరకెక్కిస్తానంటూ చెప్పిన మాట త్వరలో నిజమవుతుందా? రాజమౌళి తండ్రి – కథారచయిత విజయేంద్రప్రసాద్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారా? ‘మహాభారతం’ తీయగలనా? లేదా? అనే శక్తియుక్తులు ఉన్నాయో లేవో టెస్ట్ చేసుకోవడానికే ‘బాహుబలి’ చిత్రాన్ని రాజమౌళి నిర్మించారని ఆయనన్నారు.’బాహుబలి’ సూపర్ సక్సెస్ కావడంతో ఇక ‘మహాభారతాన్ని’ నిర్మించడానికి రాజమౌళి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చని   భావిస్తున్నానన్నారు.         
అయితే.. ‘మహాభారతం’ కనీసం ఐదారు భాగాలుగా తీస్తే తప్ప.. న్యాయం చేకూర్చలేమన్నది తన అభిప్రాయమంటూ చెప్పుకొచ్చారు.’మహాభారతం’ సినిమా అన్నది తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళికి ఇటీవల అక్కినేని అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ప్రదానం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రావాల్సిందిగా నాగార్జున కోరారు. బహుశా ఈ అవార్డు ఫంక్షన్‌లో రాజమౌళి ‘మహాభారతం’ సినిమాపై ఏదైనా ప్రకటన చేయవచ్చని అనుకుంటున్నారు.