Metroమ‌రికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న హైద‌రాబాద్ మెట్రో రైల్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు అసెంబ్లీలో ప్ర‌సంగించారు. మొద‌టి ద‌శ‌లోనే ఏకంగా 30 కిలోమీట‌ర్లు ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఆ ప్రాజెక్టు కోసం త‌మ స‌ర్కారు రూ.3 వేల కోట్లు కేటాయించిందని, ఇప్ప‌టివ‌ర‌కు 2,240 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంద‌ని తెలిపారు.హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని కేటీఆర్ చెప్పారు. ఈ నెల‌ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా తొలిద‌శ మెట్రోరైలు సేవ‌ల‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే గవర్నర్ నరసింహన్‌తో కలిసి మంత్రి కేటీఆర్ మెట్రో రైలులో ప్రయాణించారు.  నవంబర్ 8 న వీరిద్దరూ ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో రైలులో వచ్చారు. అనంతరం అక్కడ మియాపూర్ మెట్రో రైలు డిపోను సందర్శించారు. వీరి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here