Mahanati Logoనాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నిన్న మహానటి సావిత్రి పుట్టిన రోజు కావడం తో ఆమె జీవిత గాధ తో తెరకెక్కుతున్న మహానటి కి సంబదించిన లోగో యానిమేషన్ విడుదల చేసారు.సావిత్రి జయంతి సందర్భంగా సప్రైజ్ గిఫ్ట్ అందజేయబోతున్నట్టు ముందుగానే ప్రకటించింది చిత్రబృందం. అందుకు తగ్గట్టుగానే విలువైన బహుమతిని అందజేసింది. ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది.  దింతో పాటు చిత్ర రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి మరింత ఆసక్తి పెంచారు. మార్చి 29 న ఈ మూవీ ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. లోగో విషయానికి వస్తే..మాయాబజార్ మూవీ లో ఉన్న ఆ మాయాపేటికను ఓపెన్ చేయగానే.. అందులో నుండి లోగో బయటకు వచ్చేలా చూపించారు. ఆ తరువాత లోగో యానిమేషన్ మాత్రం.. యాక్షన్ సినిమా తాలూకు టైటిల్ అన్నట్లు ఉండడం తో అందరూ షాక్ తిన్నారు. కేవలం లోగో మాత్రమే కాదు మ్యూజిక్ కూడా అలాగే ఉండడం తో ఇది యాక్షన్ తరహా చిత్రమా అనే అనుమానాలు అందరిలో మొదలు అయ్యాయి. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.  కీర్తి సురేష్ సావిత్రి లో నటిస్తుంది. సావిత్రి భర్త జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తుండగా మోహన్ బాబు ఎస్వీ రంగారావు పాత్ర పోషిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here