Allu Arjunతన తోటి హీరోలు పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం కొత్తవారికి అవకాశాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే రచయిత వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు బన్నీ. వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని తరువాత బన్నీతో సినిమా చేయడానికి తమిళ దర్శకుడు లింగుస్వామి ఎదురుచూస్తున్నారు. అలానే కొరటాల శివ, వి.ఐ.ఆనంద్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బన్నీ మాత్రం మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇటీవలే సంతోష్ రెడ్డి అనే యువకుడు బన్నీని కలుసుకుని ఓ కథ చెప్పాడట. ఆ కథ చాలా కొత్తగా ఉండటం, ఇంతవరకూ ఆ తరహా పాత్రలను చేయకపోవడంతో వెంటనే బన్నీ ఓకే చెప్పేశాడు. ఈ సినిమాలో బన్నీ బాక్సర్ గా కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్టును ఎప్పుడు .. ఏ బ్యానర్లో బన్నీ  చేయనున్నాడనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here