Rana‘బాహుబ‌లి’ సినిమాల త‌ర్వాత భ‌ల్లాల దేవుడు రానా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆయ‌న న‌టించిన ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలు మంచి విజ‌యాల‌నే సాధించాయి. ‘ఘాజీ’ లాంటి పీరియాడిక్ సినిమా త‌ర్వాత ‘1945’ అనే యుద్ధ నేప‌థ్య పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు.  తాజాగా, మరో బయోపిక్ లో నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు.ట్రావెంకోర్ మహారాజు మార్తాండ వర్మ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కె. మధు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రాబిన్ తిరుమల కథను అందించారు. ప్రస్తుతం రానా ‘1945’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here