PKపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. పవన్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి దిగనుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే పవన్ వచ్చే ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ కార్యక్షేత్రంలోకి దూకుతాడని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే  పవన్ తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ చాలా కాలంగా భావిస్తోందట. దీని కోసం పవన్ కు రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేశారట. తమ సినిమాకు పవన్ ‘ఓకే’ చెబితే… ఆయన రెమ్యునరేషన్ తో కలిపి రూ. 80 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాదు, ఎన్నికల ముందు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో, ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్ అయోమయంలో పడిపోయారట. ఏం చేయాలన్న విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. ఒకవేళ పవన్ ఓకే చెబితే… దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా పవన్ అవతరిస్తారు.