Jagan Padayatraజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన విమర్శలకు వైసీపీ చీప్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రకు కొంతసేపు విరామం ఇచ్చిన ఆయన ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో తామిద్దరిదీ ఒకటే మాట అని అన్నారు. పవన్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, బాబుకు అవసరమైనప్పుడు పవన్ తెరపైకి వస్తారని విమర్శించారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించి ఆయన ప్రభావం నుంచి బయటపడితే మంచిదని సూచించారు. అధికారంలోకి ఎవరు రావాలన్నా ప్రజల దీవెన, దేవుడి ఆశీస్సులు ఉండాలని జగన్ పేర్కొన్నారు. ఇంకా ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ, చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఓ ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఓ హోటలు కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సిన పని లేదంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. అంతేగానీ, చంద్రబాబు ఫేస్ బాగుందనో, జగన్ ఫేస్ బాగుందనో వారు ముందుకు రారు. ప్రత్యేక హోదా సౌకర్యం వుంటే వారు ముందుకు వస్తారు. ప్రత్యేక హోదా సంజీవని అని, ప్రత్యేక హోదా పదేళ్లు, పదిహేనేళ్లు కావాలని నాడు చంద్రబాబు నాయుడే అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. టౌన్లలో ఉన్న ప్రజలకు ఈ విషయం బాగా అర్థమవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here