Mahesh Babuకొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను తమిళనాడులో జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ‘కారైకుడి’లో చిత్రీకరించనున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా కైరా అద్వాని నటిస్తోంది. సినిమాలో మహేష్ ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తాయని చెప్పుకొంటున్నారు. గతంలో మహేష్-కొరటాల కలయిలో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇప్పుడు భరత్ అను నేను ఆ రేంజ్ హిట్ అవుతుందని చెప్పుకొంటున్నారు.