విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని రెండో సినిమాగా “హలో” తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి  ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు నిన్న అఖిల్ ట్వీట్ చేశాడు. దాంతో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కోసం నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీజర్ లో నాగ్ వాయిస్ వినిపిస్తే అదే నిజమైన సప్రైజ్ అవుతుందేమో.. నాగార్జున ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 42 కోట్ల వరకూ ఖర్చు చేయడం వలన, ప్రతి విషయంలోను నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా ఆయన ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ జతకట్టనుంది.