Bigg Bరాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ నెల 20 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘శివ’ తర్వాత దాదాపు 27యేళ్ల తర్వాత నాగ్-వర్మ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఇది శివ తరహా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాగ్ ఆశిస్తున్నారు.  ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ‘శివ’ సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ, ఈ సినిమా అంతకిమించి ఉంటుందని చెబుతుండటం విశేషం.ఇక ఈ సినిమాలో అమితాబ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ గెస్టు రోల్ వుందట. నిడివి పరంగా చిన్నదే అయినా, కథలో ఈ పాత్ర కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ పాత్ర కోసం అమితాబ్ ను వర్మ సంప్రదిస్తున్నాడని అంటున్నారు. గతంలో అమితాబ్ – నాగ్ హిందీ ‘ఖుదాగవా’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ‘టబూ’ నటిస్తుందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని వర్మ తేల్చేశాడు కూడా. మరి అమితాబ్ గెస్టుగా చేస్తాడనే ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.         

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here