DilRaju SaiPallavi

‘ఫిదా’ సినిమాతో విజయాన్నే కాదు .. విపరీతమైన క్రేజ్ ను సాయిపల్లవి సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత ఆమెకు ఒక్కసారిగా అవకాశాలు వచ్చిపడినప్పటికీ, తరువాత సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలో చేయడానికే మొగ్గు చూపింది. ఫలితంగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా తెరకెక్కింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే దిల్ రాజు బ్యానర్ లోనే సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’కు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నితిన్, శర్వానంద్ కలిసి తెరను పంచుకోనున్నారు. ఈ సినిమా నితిన్ కి జంటగా సాయి పల్లవిని తీసుకోవాలని దిల్ రాజు భావించారు. ఐతే, ఆ ఆఫర్ ని సాయి పల్లవి తిరస్కరించినట్టు సమాచారమ్. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదంటూ పెదవి విరిచిందట. దీంతో.. ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో మరో వార్త కూడా షికారు చేస్తుంది.. గతంలో ఆమె దిల్ రాజ్ నిర్మాణ సంస్థకు అంగీకరించిన సినిమాలు తక్కువ పారితోషికానికే చేయవలసి రావడం సాయి పల్లవికి కొంత అసహనంగా మారిందన్న గాసిప్పులు కూడా వచ్చాయి. ఈ అసహనం వల్లనే సాయి పల్లవి దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో హీరో నానీతో చేస్తున్న ‘ఎంసిఏ’ షూటింగ్ సమయంలో ఆ మూవీ షూటింగ్ కు కావాలని ఆలస్యంగా వచ్చి తన అసహనాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలియపరిచింది అన్న గాసిప్పులు కూడా వచ్చాయి. అయితే ఆతరువాత ఆ గాసిప్పులను ఖండించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here