Chandrababu Koreaప్రస్తుతం దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా అనుబంధ పరిశ్రమల పెట్టుబడులను తొలిరోజు ఖరారు చేసుకున్నారు. ఏపీలో 4,995.20 కోట్ల పెట్టుబడులు కియా అనుబంధ సంస్థలు పెట్టనున్నారు. కియా అనుబంధ సంస్థల ద్వారా 7,171 ఉద్యోగాలు రానున్నాయి. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో.. లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకున్నారు. ఏపీ ఈడిబీ ఒప్పందం విలువ రూ.3000 కోట్లు.కాగా బుసాన్ లో నిర్వహించిన బిజినెస్ సెమినార్ లో పాల్గొన్న  చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు ఎప్పుడూ స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్)లో ముందున్నామని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణంలో దక్షిణ కొరియా కూడా భాగస్వామి కావాలని స్థానిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్లలో 26 పురస్కారాలను అందుకున్నామని, ‘కియా మోటార్స్ ను అడగండి, ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ ప్యాకేజ్ ఇస్తున్నామని, తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు.