Jai Lava Kusa
ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ సినిమా  విడుదల కు ముస్తాబవుతోంది… సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న ఎన్టీఆర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృతగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవ్వనున్న ఈ సినిమా కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.. ఎన్టీఆర్ .. బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ స్వయంగా తెలియజేశారు.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లకు .. ట్రైలర్ కు .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్ తో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసాన్ని చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. రాశిఖన్నా .. నివేదా థామస్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కావడం కూడా వాళ్ల ఆసక్తికి మరో కారణమవుతోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో మరీ..