Janasena Pawan Kalyan

రాజకీయాల్లో మార్పు తెస్తూ, ప్రజలకు మంచి చేయాలని అనుకున్న తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎంతో మంది ద్రోహం చేశారని, వాళ్లను కొట్టినా, తిట్టినా సరిపోదని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిబ్బంది కి మద్దతు ఇవ్వడానికి విశాఖ పట్నం వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు..పీఆర్పీని ఎవరెవరు దెబ్బతీశారన్న విషయాన్ని తాను ఏ క్షణం కూడా మరచిపోలేదని, వారి పేర్లన్నీ తన గుండెల్లో ఉన్నాయని అన్నారు. ఓ మంచి పని చేయాలనుకున్న మెగాస్టార్ ను చిన్న చిన్న కీటకాలు తినేశాయని ఆరోపించారు. వారు తన అన్నకు చేసిన ద్రోహం కంటే, ప్రజలకు చేసిన ద్రోహమే తీవ్రమైనదని చెప్పారు. చిన్నపాటి స్వలాభాల కోసం, స్వల్పకాల ప్రయోజనాల కోసం ఓ గొప్ప ప్రయత్నానికి వారు అడ్డు తగిలారని అన్నారు. సీట్లు దక్కలేదని, అధికారం చేజిక్కలేదని తనకు బాధ లేదని, నవ రాజకీయాన్ని సృష్టించలేకపోయామన్నదే తన బాధని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సెన్సార్ విషయంలో ఇబ్బంది వచ్చిన తాను ఎవరిదగ్గరకి వెళ్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. నాకు భయం లేదు, ధైర్యం ఉంది. ఒక ప్రాణం. పోతే అది మీకోసం పోగొట్టుకుంటాను కానీ, ఎవరి కోసమో కాదని ఆయన ఆవేశంగా ప్రకటించారు. ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. నేను పిడికెడు మట్టే కావొచ్చు. కానీ, అది ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నారు ఆయన. మొట్టమొదటి సారిగా డీసీఐ విషయంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here