Chiranjeeviచిరంజీవి లేటెస్ట్ ప్రాజెక్టు ‘సైరా నరసింహారెడ్డి’ పై  ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఓ కీలకమైన రోల్ కోసం జగపతిబాబు తీసుకున్నట్లు తాజా సమాచారం. నరసింహా రెడ్డి వెన్నంటే ఉంటూ .. ఆంగ్లేయులకు ఉప్పందించి వెన్నుపోటు పొడిచే పాత్రలో ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించి మెప్పిస్తొన్న జగపతిబాబు, ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడని భావించి ఎంపిక చేసుకున్నారట.
 
ఈ మధ్యకాలంలో జగపతిబాబు చేస్తున్న నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను బాగుండడంతో దీనికి ఆయనైతే పూర్తి న్యాయం చేస్తాడని భావించి ఎంపిక చేసినట్టు యూనిట్ చెబుతున్నమాట.  మూడేళ్ల కిందట వచ్చిన ‘లెజెండ్‌’లో తనలోని విలనిజాన్ని బయటపెట్టిన జగపతిబాబు, అక్కడ నుంచి వెనుదిగిరి చూడలేదు. ఓ వైపు నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తూనే, మరోవైపు హీరోలకు ఫాదర్ రోల్స్ చేస్తున్న విషయం తెల్సిందే.. ఈ సినిమాతో జగపతి కెరీర్ పీక్స్ కెళ్లే లా కనిపిస్తుంది.