Rajamouli Multistarrerతారక్, చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి మల్టి స్టారర్ ఖాయం అయినట్టే అని ఫిలిం నగర్ కోడై కూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకో కీలక విషయం కూడా బయటకు వచ్చింది. సాధారణంగా మల్టి స్టారర్ అనగానే ఇద్దరు హీరోల పాత్రలు డీ అంటే డీ అనే విధంగా వుంటాయని ఊహించుకుంటారు. ఇక మనోభావాల పేరుతో సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఆ రచ్చ కొనసాగుతుంది. ఒకరి పాత్ర ఎక్కువ ఇంకొకరి పాత్ర తక్కువ అనే చర్చ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మెగా, నందమూరి ఫాన్స్ మధ్య ఎప్పటినుంచో ఓ వార్ జరుగుతూనే వుంది. ఇప్పుడు ఈ మల్టి స్టారర్ లో వాళ్లిద్దరూ తలపడే సన్నివేశాలు ఉంటే అది ఇంకెక్కడికి దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇదంతా ముందే ఊహించి రాజమౌళి తారక్, చరణ్ కాంబినేషన్ లో చేసే సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్ ఉండ‌వ‌ని తెలుస్తోంది. త‌న సినిమాల్లో గ్రాఫిక్స్‌ను అధికంగా ఉప‌యోగించి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే రాజ‌మౌళి త‌న కొత్త సినిమాలో మాత్రం ఆ మాయాజాలాన్ని క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాజ‌మౌళి తీయ‌నున్న ఈ సినిమా కోసం ర‌చ‌యిత విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారు.తాను త‌దుప‌రి చిత్రాన్ని వీఎఫ్‌ఎక్స్‌తో పని లేకుండా తీస్తానని రాజమౌళి కొన్ని నెల‌ల ముందు తెలిపారు. ఆయ‌న చెప్పిన ఆ మాట‌లు ఈ వార్త‌కు బ‌లాన్నిస్తున్నాయి. గ్రాఫిక్స్‌ను ఉప‌యోగించ‌కుండా రాజ‌మౌళి ఎటువంటి క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల చేతుల్లో త‌లో సినిమా ఉంది. స‌ద‌రు హీరోలు ఆ సినిమాల షూటింగుల‌ను ముగించుకోగానే రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌నున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here