Srikanth Addalaఒక సినిమాకు నెగెటివ్ రిజల్ట్ వస్తే అది ఒక దర్శకుడి కెరీర్‌ను ఎలా మార్చేయగలదో గతంలో చాలా రుజువులే ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ టైటిల్ తోనే అటు ఇండస్ట్రీని.. ఇటు జనాల్లోను విపరీతమైన క్యూరియాసిటీ కలిగించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.ఆ సినిమాతో హిట్ కొట్టేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నే దృష్టిలో పెట్టుకుని ఆయన మహేశ్ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, భారీ పరాజయాన్నే మూటగట్టుకుంది. ఆ తరువాత ఆయన మరో కథపై కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ కథ పూర్తయిన తరువాత ఆయన అల్లు అరవింద్ ను కలవగా, గీతా ఆర్ట్స్ పై తెరకెక్కించడానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ కొత్తగా .. కథనం ఆసక్తికరంగా ఉండటం వల్లనే అల్లు అరవింద్ ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమా నూతన నటీనటులతో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి .. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.      .