CM kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తీసుకున్న ఓ నిర్ణయానికి ప్రలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి అభినందిస్తున్నారు.. ఇటు ప్రజలు సైతం కేసీఆర్ ని మెచ్చుకుంటున్నారు. ఇంటర్‌ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాల బాగుంది అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు ట్విటర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. 
 
ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలో ఏపీ కూడా ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిన్న నిర్ణయించింది. తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని కేసీఆర్‌ ప్రకటించారు.