jawan
వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి తిక్క, విన్నర్ రూపంలో ఎదురుదెబ్బే తగిలింది. దాంతో ఈసారి వినూత్నంగా దేశభక్తి ప్రధానాంశంగా జవాన్ అనే ఓ సినిమా చేస్తున్నాడు. రచయిత బివీ ఎస్ రవి ఈ చిత్రానికి దర్శకుడు.. ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెలలో రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు.. అయితే ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు, కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తే మరింత బాగా వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.
 
అంతే కాకుండా ఒక పాట షూటింగ్ కూడా పెండింగ్ లో వుంది. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి రాలేకపోతోంది. దిల్ రాజు సూచనల మేరకు మిగతా పనులను పూర్తిచేసి, నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైనట్టేనని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ చేసిన సంగతి తెలిసిందే. తాను చేసిన ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్’ .. ‘జవాన్’ వరుసగా విడుదల కానుండటంతో మెహ్రీన్ ఫుల్ ఖుషీ అవుతోందట.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here