Syeraaచిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం సైరా నరసింహారెడ్డి..స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా సైరా నరసింహా రెడ్డి తెరకెక్కనుంది.నిజానికి సైరా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ కెమెరామెన్ రవివర్మన్ తప్పుకోవడంతో షూట్ వాయిదాపడింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు రత్నవేలు సినిమాటోగ్రర్ గా ఎంపికవగా, త్వరలోనే మ్యూజిక్ డైరక్టర్ ఎంపిక కూడా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలుపెడుతున్నట్టుగా టీమ్ ప్రకటించింది. అలా ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటినుంచి మొదలుకానుంది.హైదరాబాద్, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here