Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ , అను ఇమ్మానుయేల్ కథానాయికలు.. తెలుగు లో ఫస్ట్ టైం కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మొదటి పాట ఇటీవలే పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఇక్కడ పవన్ .. కీర్తి సురేశ్ ల పై ఒక పాటను .. కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళుతుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేశారు.
 
త్రివిక్రమ్ -పవన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాకి మేనత్త .. మేనల్లుడి సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తెరకెక్కుతోన్న సినిమాలో, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలుస్తుందట. సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే వుంటాయని అంటున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.